తెలంగాణ మంత్రి కొండా సురేఖతో ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్‌లో మాట్లాడారు. మీడియా ముందుకు వెళ్లవద్దని, సమస్యను చర్చల ద్వారా పరిష్కరిద్దామని సూచించినట్లు తెలిసింది.
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ను ఇటీవల బాధ్యతల నుంచి తొలగించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిమెంట్ కంపెనీల యాజమాన్యాలను బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సురేఖ నివాసానికి పోలీసులు వెళ్లగా, ఆమె కుమార్తె సుస్మిత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పెద్దలే తమపై బురద జల్లేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.