హైదరాబాద్ రాయదుర్గంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. రాయదుర్గంలోని నాలెడ్జి సిటీ పరిధిలోని సత్వ బిల్డింగ్ లో ఈ ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 6 గంటల సమీపంలో మంటలు వచ్చాయి. చూస్తుండగానే బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న ఉద్యోగులను అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.