Tuesday, July 1, 2025

ఆర్సీబీ విజ‌యోత్స‌వంలో విషాదం

Must Read

ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న‌ ఆర్సీబీ విజయోత్సవంలో పెను విషాదం చోటు చేసుకుంది. బెంగ‌ళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకు తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11మంది చనిపోయారు. 33మంది గాయపడ్డారు. వారికి ఆసు పత్రిలో చికిత్స అందిస్తున్నా రు.ఆర్సీబీ జట్టుకు చిన్న స్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తమ అభిమాన ప్లేయర్లను చూసేందుకు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో చిన్నస్వామి స్టేడియానికి తరలివచ్చారు.
వేలాదిగా మంది అక్కడికి చేరుకున్నారు. స్టేడియం గేట్లను తోసుకుని దూసుకె ళ్లేందుకు అభిమానులు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. స్టేడియానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే తొక్కి సలాట జరిగింది. అందులో ఊపిరి ఆడక కొందరు చనిపోయారు. స్టేడియం దగ్గర సరైన సమయంలో గేట్లు తెరవకపోవడం వల్లే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు గేట్లు తోసుకుంటూ ముందుకు దూసుకొచ్చారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని సమాచారం. క్రౌడ్ ను అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. కేవలం పాస్ లు ఉన్న వారిని మాత్రమే స్టేడియం లోకి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. అభిమానులంతా చిన్నస్వామి స్టేడియం వైపు వెళ్లే ప్రయత్నం చేశారు.దీంతో స్టేడియం పరిసరాలు జన సమూహంతో జామ్ అయ్యాయి. వేలాది మంది వస్తారని అనుకుంటే లక్షల మంది వచ్చేశారని, వారిని అదుపు చేయడం తమకు సాధ్యం కాలేదని పోలీసులు వాపోయారు.తొక్కిసలాట ఘటనతో స్టేడియం నుంచి వెళ్లిపోవాలని అభిమాను లకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. చిన్నస్వామి స్టేడియం పరిసరాల్లో మెట్రో సేవలు నిలిపివేశారు. తొక్కిసలాట లో సృహ తప్పి పడిపో యిన వారికి పోలీసులు వెంటనే సీపీఆర్ చేశారు. కానీ, వారి ప్రాణాలను కాపాడలేకపోయారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -