సుప్రీంకోర్టులో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట లభించింది. ‘సనాతన ధర్మం’ గురించి 2023 సెప్టెంబర్‌లో ఉదయనిధి చేసిన వివాదాస్పద ప్రసంగానికి సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో మూడు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్లను ఎలా కొనసాగించగలరని ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. వీటిని విచారించేందుకు నిరాకరించింది.