Saturday, February 15, 2025

మహా కుంభమేళాకు వేళాయె!

Must Read

ప్రపంచంలోనే అతిపెద్ద హిందు ఉత్సవం మహాకుంభమేళాకు సర్వం సిద్ధమైంది. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే మహత్తర సమ్మేళనం జనవరి 13 నుండి ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో కుంభమేళా ప్రారంభమవుతుంది. ఇప్పటికే కుంభమేళాకు రైళ్లు, బస్సులు, ఫ్లైట్‌ బుకింగ్స్‌ ఫుల్‌ అయ్యాయి. 45 రోజుల పాటు సాగే ఈ కుంభమేళా కోసం దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తరలివస్తారని భావిస్తున్నారు.

కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభమేళా పర్వదినాల్లో ఉత్తరప్రదేశ్‌కు రూ.2 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. పన్నెండు పుష్కరాలకు వచ్చే మహాకుంభమేళా కావడంతో అత్యంత వైభవంగా జరపాలని.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

కుంభమేళా సందర్భంగా అఘోరాలు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటున్నారు. ప్రయాగరాజ్‌ వీధుల్లో నాట్యాలు చేస్తూ భక్తులను ఉత్తేజపరుస్తున్నారు. మరోవైపు కుంభమేళాకు రకరకాల బాబాలు వస్తున్నారు. అందరి కన్నా ఇక్కడ కనిపిస్తున్న రుద్రాక్ష బాబా హైలైట్‌గా నిలుస్తున్నారు. 11వేల రుద్రాక్షలతో ఆయన అలంకరణ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తం 30కేజీల బరువున్న ఈ అలంకారంతోనే రుద్రాక్ష బాబా దర్శనమిస్తారు. ఆయన దగ్గర రుద్రాక్షను తీసుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -