Saturday, April 11, 2026

మహా కుంభమేళాకు ప్రత్యేక వెబ్‌పేజీ

Must Read

ఈనెల 13 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాకు ఉత్తరప్రదేశ్‌లోని గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశం ప్రయాగ్‌రాజ్‌ ముస్తాబవుతోంది. మహా కుంభమేళాకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం యూపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. కుంభమేళా నేపథ్యంలో ప్రత్యేక వెబ్‌పేజీని రూపొందించినట్లు తెలిపింది. ఇందులో ప్రతి 15 నిమిషాలకోసారి వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చని ఐఎండీ అధికారులు తెలిపారు. అంతేకాకుండా రోజుకు రెండు సార్లు వాతావరణ సూచనలను జారీ చేస్తామని వెల్లడించారు. ఈనెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ 45 రోజుల పాటు మహా కుంభమేళా జరగనున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -