Sunday, June 15, 2025

భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి

Must Read

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లాలో గురువారం మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోందిజ

బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు మరణించిన నాలుగు రోజులకే మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్‌లో భద్రతా సిబ్బంది ఉమ్మడి బృందం బయటకు వచ్చినప్పుడు అడవిలో కాల్పులు ప్రారంభమయ్యాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -