తాను పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తలపై వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి స్పందించారు. ‘నేను వైసీపీని వీడను. నేను పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్లు ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడాలి. కష్టాలు వచ్చినప్పుడే పోరాడాలి.. నిలబడాలి. విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం ఆయన వ్యక్తిగతం.’ అంటూ అయోధ్య రామిరెడ్డి వ్యాఖ్యానించారు.