స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే తెలంగాణాలో రాజకీయాలు హీటెక్కాయి. నిజామాబాద్ జిల్లాలో జాతీయ జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు కావడంతో దానిని క్యాష్ చేసకోవాలని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పసుపు బోర్డు తమ వల్లే వచ్చిందని బీఆర్ఎస్ నేతలు చెబుతుండగా.. తమ పోరాటంతోనే సాధ్యమైందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రచారం చేస్తున్నారు. దీనిపై ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.