Saturday, February 15, 2025

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఆప్ మేనిఫెస్టో విడుదల

Must Read

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యతరగతి మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విడుదల చేశారు. పార్లమెంట్‌లో ఆప్ ఎంపీలు లేవనెత్తే ఏడు బడ్జెట్ డిమాండ్లను చేర్చారు. వృద్ధులకు మెరుగైన వైద్యం అందించాలని సంజీవని పథకాన్ని ప్రారంభించామని కేజ్రీవాల్‌ తెలిపారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును తిరిగి వారి సంక్షేమానికి వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

కేంద్రం ముందు ఆప్ ఏడు డిమాండ్లు ఇవే

విద్యకు ప్రవేశపెట్టే బడ్జెట్‌ను 2 శాతం నుంచి 10 శాతానికి పెంచాలి.
ఉన్నత విద్య చదివే వారికి సబ్సిడీలు, స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలి.
ఆరోగ్య బడ్జెట్‌ను 10 శాతానికి పెంచాలి.
ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి రూ.10లక్షలకు పెంచాలి.
నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తొలగించాలి.
సీనియర్‌ సిటిజన్స్‌ కోసం మరింత మెరుగైన పెన్షన్ పథకాలు ప్రవేశపెట్టాలి.
రైల్వేలో సీనియర్‌ సిటిజన్లకు 50 శాతం రాయితీ కల్పించాలి.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -