ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు దావోస్ వెళ్లారు. తాజాగా జ్యురిచ్‌లో అక్కడి పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉందని.. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆయన వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేశ్, ఎంపీ టీజీ భరత్ ఉన్నారు.