ప్రజా కవి గద్దర్‌పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ పద్మశ్రీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఎందరో బీజేపీ నేతలను చంపిన వారిలో గద్దర్ కూడా ఒకరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గద్దర్‌కు పద్మశ్రీ బరాబర్ ఇవ్వబోమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలకు పేర్లను పంపితే కేంద్రం పరిశీలిస్తుందని తెలిపారు. అర్హులకే పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించిందని తేల్చి చెప్పారు.