టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీపై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర విమర్శలు చేశారు. ‘2024లో టెస్టుల్లో మొదటి ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ సగటు కేవలం 15. కోహ్లీకి బదులుగా ఒక యువ ఆటగాడికి రెగ్యులర్‌గా అవకాశాలు ఇస్తే అతను కూడా సగటున 25-30 పరుగులు చేస్తాడు. ఎందుకంటే మనం ఇక్కడ జట్టు గురించే చర్చిస్తున్నాం. టీమిండియాకు‘సూపర్ స్టార్ సంస్కృతి’ అవసరం లేదు. జట్టు సంస్కృతి అవసరం.’ అంటూ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నారు.