రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేసి చరిత్ర సృష్టించామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కులగణన జరపాలని ప్రధానిపై కూడా ఒత్తిడి వస్తోందని తెలిపారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ అందించామన్నారు. ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత లేదని విమర్శించారు. ప్రతిపక్ష నేత సభకు రావడం లేదని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఆదేశాలతో కమిషన్ వేశామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.