కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయం, రాష్ట్రాభివృద్ధికి చేపడుతున్న చర్యలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. అంతర్గత విబేధాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అమిత్ షాతో భేటీ అనంతరం బీజేపీలో జోష్ పెరిగిందనే టాక్ వినిపిస్తోంది.