యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష మే 25న జరగనుంది. మరోవైపు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో మరో 150 పోస్టులకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు సైతం ఫిబ్రవరి 11వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు https://upsconline.gov.in/upsc/OTRP/ వెబ్‌సైట్‌పై క్లిక్ చేయండి.