Thursday, April 17, 2025

ఈ లక్షణాలు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్లా?

"Discovering a Breast Lump: Understanding Signs and Symptoms"

Must Read

ఈ రోజుల్లో చాలా మందిని బాధపెడుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ప్రాణాంతకమైన ఈ వ్యాధి బారి నుంచి బయటపడటం అంత తేలిక కాదు. చికిత్స కోసం రూ.లక్షలకు రూ.లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయినా ఒక్కోసారి బతుకుతారని డాక్టర్లు గ్యారెంటీ ఇవ్వరు. అయితే క్యాన్సర్ ను త్వరగా గుర్తించగలిగితే దాని నుంచి బయటపడొచ్చని వైద్యులు అంటున్నారు. మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ రావడాన్ని గమనించొచ్చు. ఈ నేపథ్యంలో అసలు బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలను ఎలా గుర్తించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఫైబ్రోసిస్టిక్ ఛేంజెస్

Breast cancer

బ్రెస్ట్ లో క్యాన్సర్ ఉంటే కణితులు ఉంటాయి. అయితే ఈ కణితులన్నీ క్యాన్సర్ అనుకోవడానికి వీల్లేదని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. హార్మోన్ ఛేంజెస్ వల్ల శరీరంలో మార్పులు రావడం సహజమే. అయితే వీటి కారణంగా రొమ్ములో గడ్డలు ఏర్పడతాయి. దీన్ని ఫైబ్రోసిస్టిక్ ఛేంజెస్ అంటారు. హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే కణితుల కారణంగా క్యాన్సర్ రాదు. హార్మోన్ల మార్పుల వల్ల రొమ్ములు మారుతుంటాయి. దీని వల్ల బ్రెస్ట్ లోపల ఒక ముద్దలా కనిపిస్తాయి. ఇలాంటి రొమ్ము కణితులు డేంజర్ కానప్పటికీ.. అవి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

ఫైబ్రోడెనోమాస్

Breast Lumps


ఇది మరో బ్రెస్ట్ కణితి. కానీ దీంట్లోనూ క్యాన్సర్ ఉండదు. వీటిని రొమ్ములోని ముద్దలుగా చెప్పొచ్చు. గుండ్రంగా ఉండే ఈ కణితులు తాకినప్పుడు కదులుతాయి. మామూలుగా యువతుల్లో ఈ రకమైన కణితులు కనిస్తాయి. 20 ఏళ్ల బాలికల్లో ఇవి సర్వసాధారణం. అయితే నొప్పిలేని గడ్డలు కనిపిస్తే డాక్టర్స్ ను కలవడం మంచిది.

తిత్తి

Breast Lumps

రొమ్ము కణజాలంలో ద్రవంతో నిండి ఉండేదాన్ని తిత్తి అంటారు. ఇవి బ్రెస్ట్ లో గుండ్రంగా, అండాకారంలో చిన్నగా ఉంటాయి. కొంతమందిలో తిత్తులు పెద్దగా ఉంటాయి. పీరియడ్స్, హార్మోన్ల కారణంగా ఇవి ఏర్పడతాయి. ఒకవేళ తిత్తుల వల్ల నొప్పిగా అనిపిస్తే వెంటనే డాక్టర్ ను కలవాలి. అవసరమైతే వైద్యులు పరీక్షించి వీటిని తొలగిస్తారు.

అడెనోసిస్

తల్లిపాలను ఉత్పత్తి చేసే గ్రంథి కుంచించుకుపోయినప్పుడు అడెనోసిస్ అనేది వస్తుంది. ఇది రొమ్ము సైజును పెంచి అక్కడ గడ్డలు ఏర్పడేలా చేస్తుంది. అందుకే బ్రెస్ట్ సైజ్ పెద్దగా ఉన్నట్లనిపిస్తే ట్రీట్ మెంట్ కోసం డాక్టర్ ను సంప్రదించాలి.

గాయాలు

Breast Lumps

బ్రెస్ట్ పై తాకిన గాయాలు రొమ్ములో గడ్డలకు కారణమవుతాయి. ఇంజ్యురీ అయిన ప్రదేశంలో రక్తం గడ్డకట్టడం దీనికి కారణంగా చెప్పొచ్చు. ఇలా కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి. ఇలా పైన చెప్పుకున్న లక్షణాలన్నీ ప్రమాదకరమే కానీ వీటి వల్ల క్యాన్సర్ రాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ ధ‌ర్నా

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జిషీట్ చేసినందుకు ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. రాహుల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -