Saturday, April 19, 2025

అల్లంతో ఉపయోగాలు…నష్టాలు…

Must Read

అల్లంతో ఉపయోగాలు నష్టాలు – అల్లం తరచూ కూరల్లో వాడుతారు. ఎక్కువగా ఇండియా, చైనా దేశాల్లో అల్లం వేసిన వంటకాలను తింటారు. టీ, అల్లంతో కలిపిన పలు పానియాలను తాగుతారు. అల్లం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా అల్లంతో జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. రుచికరమైన వంటకాల్లో అల్లం ముఖ్యపాత్ర పోషిస్తుంది.

అల్లంతో కలిగే ప్రయోజనాలు…

అల్లం వల్ల సుఖ విరోచనాలు అవుతాయి. మధుమోహం వ్యాధిని తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచడంలో అల్లం ఎంతో ఉపయోగపడుతుంది. అల్లంతో జలుబు, జ్వరం కూడా తగ్గుతాయి. వికారం తగ్గించడానికి అల్లం ఎంతో ఉపయోగపడుతుంది. రక్తపోటును తగ్గించడంలోనూ అల్లం ముఖ్యపాత్ర పోషిస్తుంది. స్త్రీలలో నెలసరి నొప్పిని, అధిక రక్త స్త్రావాన్ని తగ్గించేందుకు అల్లం పనిచేస్తుంది.

అల్లం ఎక్కువగా తీసుకుంటే కలిగే నష్టాలు

రక్త పోటు ఉన్న రోగులు అల్లం తినడంతో పాటు మందులు వేసుకోకూడదు. అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల అలర్జీ, గ్యాస్ సమస్యలు కూడా వస్తాయి. గర్భిణులు అల్లం తక్కువగా తీసుకోవడం మంచిది. అల్లం ఎక్కువగా తీసుకుంటే డయేరియా వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల బలహీనత, నీరసం వస్తుంది.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట జిల్లాలో దారునం చోటు చేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థిని కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. సూర్యాపేట - చిలుకూరు మండలం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -