Friday, August 29, 2025

రామ్ చరణ్ ఇంటర్వ్యూ.. ఎన్టీఆర్​ను సైడ్ యాక్టర్ చేసేశారంటూ అభిమానుల ఆగ్రహం!

Must Read

రామ్ చరణ్ ఇంటర్వ్యూ.. ఎన్టీఆర్​ను సైడ్ యాక్టర్ చేసేశారంటూ అభిమానుల ఆగ్రహం!

బ్లాక్​బస్టర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్-జూనియర్ ఎన్టీఆర్​లు ఇద్దరిదీ సరిసమానమైన పాత్ర. స్క్రీన్ టైమ్, ఎన్ని ఫైట్లు, ఎన్ని సీన్స్.. ఇలాంటి లెక్కలు వేసుకోకుండా చూస్తే ఏ ఒక్కరినీ తక్కువ అంచనా వేయలేని పాత్రలు వారివి. ఇద్దరిలో ఏ ఒక్కరు లేకున్నా ‘ఆర్ఆర్ఆర్’ పరిపూర్ణమయ్యేది కాదు. ఈ తరుణంలో ‘టాక్​ ఈజీ విత్ సామ్ ఫ్రాగోసో’ షోలో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇందులో తన కెరీర్, పర్సనల్ లైఫ్ విషయాలు షేర్ చేసుకున్నారు చెర్రీ. అయితే ‘ఆర్ఆర్ఆర్’ గురించి మాట్లాడే సమయంలో ఎన్టీఆర్​ను సైడ్ యాక్టర్ అన్నాడంటూ ఓ క్లిప్ తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన తారక్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తమ ఫేవరెట్ హీరోను సైడ్ యాక్టర్ అనడం ఏంటని విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి ఇందులో హోస్ట్ తారక్​ను సైడ్ యాక్టర్ అనలేదు. ఎలాంగ్​సైడ్ యాక్టర్ (నీతోపాటు కలసి నటించిన నటుడు) అని చెప్పాడు. కొందరు నెటిజన్స్ కావాలనే సగం క్లిప్​ను వైరల్ చేయడంతో వివాదం చెలరేగింది.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -