అటు రాజకీయాలు ఇటు సినిమాలతో బిజీగా ఉంటూ ఎప్పటికప్పుడు తాజా పరిణామాలపై తన గళం విప్పుతూ వార్తల్లో నిలిచే నటి కంగనా రనౌత్. తాజాగా తన ఇంటి కరెంట్ బిల్లుపై కంగనా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తన ఇంటికి కరెంట్ బిల్లు రూ.లక్ష వచ్చిదంటూ ఫైర్ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్ మనాలీలో ఉన్న తన ఇంటికి లక్ష రూపాయల బిల్లు ఎలా వేశారని అధికారులపై మండిపడుతోంది. తనసలు ఆ ఇంట్లో ఉండనే ఉండట్లేదని ఎడాపెడా బిల్లు వేసిన ప్రభుత్వాన్ని తూర్పారబట్టింది. ఈ మేరకు మండిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ కంగనా మాట్లాడుతూ.. మనాలీలో ఉన్న నా ఇంటికి రూ.లక్ష కరెంట్ బిల్లు వేశారు. నేను ఉండని ఇంటికి ఈ రేంజ్‌లో వచ్చిన బిల్లు చూసి షాకయ్యాను. ఒకరకంగా చెప్పాలంటే ప్రభుత్వ చర్యకు సిగ్గుపడుతున్నా. రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడం మనందరి బాధ్యత, అలా చేయాలంటే ఇలాంటి తోడేళ్ల నుంచి మన రాష్ట్రానికి విముక్తి కల్పించాలి అని పిలుపునిచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.