నిజంగా ఆయన ఉమ్మేశాడా? యాంకర్కు మలాలా దిమ్మతిరిగే రిప్లయ్!
యూఎస్లోని లాస్ ఏంజెల్స్లో 95వ ఆస్కార్స్ వేడుక వైభవంగా జరిగింది. అంతర్జాతీయ సినిమా తారలు ఇందులో సందడి చేశారు. ఈ వేడుకల్లో ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్ జాయ్ కూడా పాల్గొనడం విశేషం. భర్త ఆసర్ మాలిక్తో కలసి వేడుకలకు ఆమె అటెండ్ అయ్యారు. ఆమె నిర్మించిన ‘స్ట్రేంజర్ ఎట ద గేట్’ షార్ట్ డాక్యుమెంటరీ విభాగంలో నామినేట్ అయింది. కాగా, ఈవెంట్ జరుగుతున్నప్పుడు హోస్ట్ జిమ్మి కిమ్మెల్ మలాలాలను ఓ వివాదాస్పద ప్రశ్న అడిగాడు. క్రిస్ పైన్పై హ్యారీ స్టైల్స్ ఉమ్మి వేశాడని మీరు భావిస్తున్నారా? అని క్వశ్చన్ చేశాడు. దీనికి మలాలా ఘాటుగా బదులిచ్చారు.
‘నేను ఇక్కడ శాంతి గురించే మాట్లాడేందుకే వచ్చాను. అదే మాట్లాడతాను’ అని మలాలా సమాధానం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ట్విట్టర్, ఫేస్బుక్లో వైరల్ అవుతున్నాయి. కాగా, కొన్నాళ్ల కింద అమెరికన్ గాయకుడు, రచయిత హ్యారీ స్టైల్స్ ఓ వివాదంలో కూరుకుపోయారు. గ్రామీ అవార్డు విజేతగా నిలిచిన హ్యారీ.. వెనీస్‌లో జరిగిన డోంట్ వరీ డార్లింగ్ ప్రీమియర్ సందర్భంగా యూఎస్ నటుడు క్రిస్ పైల్‌పై ఉమ్మి వేశారనేది అత్యంత హాట్ టాపిక్గా మారింది.