Thursday, September 19, 2024

షారుక్ హీరోయిన్‌కు యాక్సిడెంట్.. వీడియో వైరల్!

Unbelievable accident involving Ferrari, Lamborghini in Sardinia kills 2

Must Read

రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది జీవితాలు కోల్పోతున్నారు. ప్రమాదాల్లో చనిపోయి ఆప్తులు దూరమవ్వడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. యాక్సిడెంట్ వల్ల కుటుంబ పెద్దల్ని కోల్పోయి రోడ్డున పడిన కుటుంబాలకు లెక్కేలేదు. అక్కడా ఇక్కడా అని కాకుండా అన్ని చోట్లా ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హైవేల మీద జరిగే ప్రమాదాలు ఎక్కువ. నిర్లక్షమైన డ్రైవింగ్, ఆల్కహాల్ సేవించి బండి నడపడం, రూల్స్ పాటించకపోవడం, నిద్రమత్తు.. ఇలా ప్రమాదాలకు చాలా కారణాలు ఉన్నాయి. అయితే కారణాలు ఏవైనా ప్రమాదాలు మిగులుస్తున్న బాధ అంతా ఇంతా కాదు. మన దేశంలోనే కాదు ఫారెన్ కంట్రీస్ లోనూ రోడ్డు ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.

నాణ్యమైన రోడ్లు, మంచి ట్రాఫిక్ నిర్వహణ కలిగిన అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ లాంటి బడా దేశాలు కూడా ప్రమాదాలను నివారించలేకపోతున్నాయి. ఇటీవల ఇటలీలో ఇలాగే ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ యాక్సిడెంట్ లో లగ్జరీ కార్లైన లంబోర్గినీ, ఫెరారీ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఫెరారీలోని ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. అయితే లంబోర్గినీ కారులో ఉన్నది మరెవరో కాదు షారుక్ ఖాన్ సహనటి గాయత్రీ జోషి, ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ కావడం గమనార్హం. గాయత్రి, వివేక్ లు వెకేషన్ కోసం ఇటలీకి వెళ్లిన టైమ్ లో ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది. అక్కడ నిర్వహించిన సూపర్ కార్ టూర్ లో ఈ స్టార్ కపుల్ పాల్గొన్నారు. అయితే వీళ్లు ప్రయాణిస్తున్న లంబోర్గిని కారు, ఫెరారీ కారు పరస్పరం ఢీకొన్నాయి.

కార్లు ఒకదాన్ని మరొకటి ఓవర్ టేక్ చేసే టైమ్ లో ఈ ప్రమాదం జరిగింది. లంబోర్గినీ కారు గట్టిగా తాకడంతో ఫెరారీ కారు పక్కనే ఉన్న క్యాంపర్ వ్యాన్ ను ఢీకొంది. ఆ తర్వాత ఫెరారీకి మంటలు అంటుకున్నాయి. దీంతో అందులో ఉన్న స్విస్ కపుల్ ఇద్దరూ చనిపోయారని సమాచారం. దేవుడి దయ వల్ల తాము ఈ ప్రమాదం నుంచి సేఫ్ గా బయటపడ్డామని గాయత్రీ జోషి తెలిపారు. కాగా, 2004లో రిలీజైన ‘స్వదేశ్’ సినిమాతో తెరంగేట్రం చేశారు గాయత్రి. కింగ్ ఖాన్ షారుక్ యాక్ట్ చేసిన ఆ మూవీ మంచి హిట్ గా నిలిచింది. 2005లో వికాస్ ఒబెరాయ్ ను మ్యారేజ్ చేసుకున్నారు గాయత్రి. ఆ తర్వాత ఛానెల్ వీ ఇండియాలో వీడియో జాకీగా పనిచేశారు. అనంతరం మోడలింగ్ లోకి వెళ్లి అక్కడా తన లక్ ను పరీక్షించుకున్నారు.  

- Advertisement -
- Advertisement -
Latest News

జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్

అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -