Thursday, September 19, 2024

విరుష్క ఫ్యాన్స్‌కు ఆ రోజున బిగ్ సర్‌ప్రైజ్!  

Anushka Sharma Expecting Second Child With Husband Virat Kohli

Must Read

ఫిల్మ్ స్టార్స్కు, క్రికెటర్లకు మన దేశంలో ఉండే పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు. వీళ్లంటే పడిచచ్చే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అలా దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వారిలో ఒకరు విరాట్ కోహ్లీ. ఈ టీమిండియా స్టార్ క్రికెటర్ కు భారత్ లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. క్రికెట్ అంటే తెలియని వారికి కూడా విరాట్ సుపరిచితుడని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. అంతగా జెంటిల్మన్ గేమ్ పై తనదైన ముద్ర వేశాడు కోహ్లీ. అతడు గ్రౌండ్ లోకి దిగాడంటే చాలు.. ప్రత్యర్థి జట్లు షేక్ అవుతాయి. విరాట్ కు బౌలింగ్ చేయడానికి పేరుగాంచిన మహా మహా బౌలర్లు కూడా భయపడతారు.

సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని లాంటి లెజెండ్స్ తర్వాత క్రికెట్ మీద విరాట్ కోహ్లీ వేసిన ముద్రను ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. ప్రస్తుత క్రికెట్ లో అతడికి సాటి వచ్చే క్రికెటర్ ఒక్కరు కూడా లేరు. అలాంటి విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ గురించి కూడా వినే ఉంటారు. బాలీవుడ్ లో తనదైన నటన, డ్యాన్సులతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు అనుష్క. హిందీ టాప్ హీరోల పక్కన నటిస్తూ టాప్ హీరోయిన్ ఛెయిర్ కు మరింత చేరువయ్యారు. అయితే అలాంటి టైమ్ లోనే విరాట్తో ప్రేమలో పడ్డారు అనుష్క. కొన్నాళ్లు లవ్ చేసుకున్నాక పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకొని వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు.

విరాట్-అనుష్క జంటను అందరూ ముద్దుగా విరుష్క అని పిలుస్తారు. విరుష్క కపుల్ కు వామిక అనే కూతురు ఉన్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే ఈ కపుల్ కు మరో సంతానం కలగనుందని సమాచారం. ప్రస్తుతం అనుష్క శర్మ గర్భంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రెగ్నెన్సీ విషయాన్ని విరుష్క కపుల్ చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారని తెలుస్తోంది. అయితే త్వరలోనే ఈ విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకోనున్నారట. భారత క్రికెట్ కొత్త దేవుడైన కోహ్లీ పుట్టిన రోజు నవంబర్ 5. సో, బర్త్ డే నాడే ఈ శుభవార్తను అభిమానులతో పంచుకోవాలని విరుష్క జంట డిసైడ్ అయ్యారని టాక్. కొన్నాళ్లుగా అనుష్క పబ్లిక్ లో తిరగడం లేదు. కోహ్లీతో కలసి ఆమె స్టేడియానికి కూడా రావట్లేదు. దీంతో ఆమె పక్కా ప్రెగ్నెంట్ అని న్యూస్ వినిపిస్తోంది. ఈ విషయంపై స్వయంగా విరుష్క క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

- Advertisement -
- Advertisement -
Latest News

జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్

అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -