Sunday, December 28, 2025

హీరో అజిత్ కుమార్‌కు ప్రముఖుల శుభాకాంక్షలు

Must Read

దుబాయ్‌లో జరిగిన 24హెచ్ కార్ రేస్‌లో హీరో అజిత్ కుమార్.. ఆయన బృందం మూడవ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఆయన టీమ్‌కు పలు వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హీరో శివకార్తికేయన్, దర్శకుడు శివ, సంతోష్ నారాయణన్, లోకేష్ కనగరాజ్, యువన్, కార్తీక్ సుబ్బరాజ్, శాంతను, హరీష్ కళ్యాణ్ తదితరులు అభినందనలు తెలిపారు.

“దుబాయ్ 24హెచ్ రేసింగ్ పోటీలో 991 కేటగిరీలో మూడో స్థానం, జీటీ4 కేటగిరీలో ‘స్పిరిట్ ఆఫ్ ద రేస్’ అవార్డు కైవసం చేసుకున్న అజిత్ కుమార్, ఆయన టీమ్ కు హృదయపూర్వక శుభాభినందనలు. సవాళ్లకు ఎదురొడ్డి నిలిచి గొప్ప పట్టుదలతో రేసులో గెలిచి భారత త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ వేదికపై రెపరెపలాడించడం నిజంగా స్ఫూర్తిదాయకం. మీరు, మీ జట్టు మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -