మూసీ నదీ పరివాహక ప్రాంతంలోని ఇండ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. తొలి దశలో రివర్ బెడ్ లో కూల్చివేతలు ప్రారంభించారు. చాదర్ ఘాట్ లోని మూసా నగర్, రసూల్ పురా, శంకర్ నగర్ లోని ఇండ్లను కూల్చివేస్తున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు నష్టపరిహారంతో పాటు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
గుర్తు తెలియని దుండగులు తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు పెట్టారు. ఈ సంఘటన సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో జరిగింది. సోమవారం రాత్రి ఈ దుశ్చర్య జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయి. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. 2.45 లక్షల మందికి పైగా నిరుద్యోగులు పరీక్షలు రాశారు. జూలై 16 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరిగాయి....
హైడ్రా పనితీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహించింది. నగరంలోని పలుచోట్ల కూల్చివేతలపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. దీనికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హాజరయ్యారు. విచారణ సమయంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైడ్రా చట్టప్రకారం వ్యవహరించడం లేదని పేర్కొంది. ‘శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారు? ఆదివారం...
వైఎస్ జగన్ ఎమోషనల్
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఎమోషనల్ అయ్యారు. తన కులం, మతం గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసు అని, కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. తాను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని.. గడప దాటితే హిందూ, ఇస్లాం, సిక్కు, బౌద్ధ మతాలను గౌరవిస్తానని తెలిపారు. పాదయాత్ర...
చంద్రబాబు దుర్బుద్ధితోనే తిరుమల లడ్డూ విశిష్టతను దెబ్బతీశారని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. జంతువుల కొవ్వు కలిసిందని ఒక దుష్ప్రచారం చేయించి రాక్షసానందం పొందారని విమర్శించారు. 100 రోజుల పాలన విఫలం అవ్వడంతోనే ఈ లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలోనే నెయ్యి కంటైనర్లు వచ్చాయని, దానికి పూర్తి బాధ్యత వహించాల్సింది...
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దయింది. చంద్రబాబు లడ్డూపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పాప ప్రక్షాళన చేయాలని వైఎస్ జగన్ భావించారు. కానీ జగన్ పై దాడికి కుట్ర పన్నారని పార్టీ వర్గాల నుంచి తెలియడంతో పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. మరోవైపు వైఎస్ జగన్ తిరుమల పర్యటన సందర్భంగా పోలీసులు...
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్ లో పెను ముప్పు తప్పింది. మూవీ చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తోపులాట జరిగింది. కొందరు వ్యక్తులు బాంబులు పేల్చారు. దీంతో పక్కనే ఉన్న ఎన్టీఆర్ కటౌట్ కు మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లో కటౌట్ కాలిపోయింది....
ఇక అయోధ్యకు నేరుగా ఫ్లైట్
తెలుగు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసులను ప్రారంభించింది. ఈ రోజు నుంచి హైదరాబాద్ – అయోధ్య మధ్య కొత్త సర్లు మొదలుకానున్నాయి. ఈ రూట్లలో వారానికి నాలుగు సార్లు విమాన సేవలు నడపనున్నారు.
లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై నటుడు సైఫ్ అలీఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గురించి మాట్లాడారు. రాహుల్ గాంధీ నిజాయతీ గల పొలిటికల్ లీడర్ అని, ఎంతో ధైర్యవంతుడని కొనియాడారు. ప్రజాభిమానం చూరగొనేందుకు రాహుల్ ఎంతో శ్రమించారని తెలిపారు. తనపై వచ్చిన...