Tuesday, January 27, 2026

News

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హోం ఓటింగ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటింగ్ ఈ నెల 11న జరగనుండగా, మంగళవారం 97 మంది ఓటర్లు ముందస్తుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు మరియు దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచింది. ఈ ఉప ఎన్నికలకు హోం ఓటింగ్ కోసం...

శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి వైభవం!

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం భక్తుల సందడితో నిండిపోయింది. తెల్లవారుజాము నుంచి వేలాది మంది యాత్రికులు ఆలయానికి చేరుకుని, పాతాళగంగలో పుణ్యస్నానాలు చేసి గంగాదేవిని ప్రార్థించారు. ఈ స్నానం అత్యంత పవిత్రమైనదిగా నమ్ముతూ భక్తులు భక్తిభావంతో పాల్గొన్నారు. గంగాధర మండపం, ఉత్తర మాడవీధి, ఈశాన్య వీధుల్లో...

తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి: వైయ‌స్ జగన్

మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూచించారు. తుపాను ముప్పు తగ్గే వరకు అందరూ సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ఆయన కోరారు. తుపాను సహాయం, పునరావాస కార్యక్రమాల్లో ప్రజలకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని జగన్ పిలుపునిచ్చారు.

బాలికల బాత్రూమ్‌లో రహస్య కెమెరాలు: ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్ వేటు

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో బాలికల బాత్రూమ్‌లో రహస్య కెమెరాలు బయటపడిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అటెండర్ యాకుబ్ బాలికలపై లైంగిక దాడి చేసిన విషయాన్ని దాచిపెట్టిన ప్రిన్సిపాల్ కమలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమెను సస్పెండ్ చేసే ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్...

తెలుగు యువ‌కుడికి అబుదాబిలో రూ.240 కోట్ల లాటరీ

యూఏఈ అబుదాబిలో నివసించే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 29 ఏళ్ల బోళ్ల అనిల్ కుమార్, ఈ నెల 18న జరిగిన లక్కీ డ్రాలో 100 మిలియన్ దిర్హామ్స్ (సుమారు 240 కోట్ల రూపాయలు) గెలుచుకున్నాడు. లాటరీ టికెట్ కొనుగోలు అలవాటులో భాగంగా ఒక టికెట్ తీసుకున్న అనిల్, చివరి నంబర్లు తన తల్లి పుట్టినరోజు తేదీతో...

జూబ్లీహిల్స్ పోలింగ్ పూర్తయ్యే వరకు హైదరాబాద్‌లోనే ఉండండి: మంత్రులకు రేవంత్ ఆదేశాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచార గడువు ముగిసే వరకు మంత్రులు హైదరాబాద్‌ను వదిలి వెళ్లకూడదని ఆదేశించారు. మంత్రులు ఇంటి ఇంటికీ తిరిగి ఓట్లు సేకరించాలని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు మంత్రులకు సహకరించాలని రేవంత్ రెడ్డి సూచించారు. నవంబర్ 9 వరకు ఈ...

విజయ్ ఆర్థిక‌ సాయాన్ని తిరస్కరించిన కుటుంబం!

తమిళనాడు కరూర్‌లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో మృతుడైన రమేశ్ భార్య సంఘవి, టీవీకే అధ్యక్షుడు విజయ్ పంపిన 20 లక్షల రూపాయల పరిహారాన్ని తిరిగి పంపేసింది. మృతుల కుటుంబాల ఖాతాల్లో ఈ నెల 18న జమ చేసిన మొత్తాన్ని తిప్పి పంపినట్లు సంఘవి తెలిపింది. విజయ్ వీడియో కాల్‌లో మాట్లాడుతూ, తను నేరుగా...

తుఫాన్ ప్ర‌భావంతో ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

ఆంధ్రప్రదేశ్‌లో మోంథా తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు పొడిగించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా తీర జిల్లాలతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరంతర వర్షాలు పడుతున్నాయి. తుపాను ప్రభావం...

ఏపీలో మోంథా తుఫాన్ విధ్వంసం

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల‌ను మోంథా తుఫాన్ హ‌డ‌లెత్తించింది. నరసాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 నుంచి 12 గంటల మధ్య తీవ్ర తుపాను దాటింది. దీంతో సముద్రం అల్లకల్లోలమైంది. ప్రస్తుతం రెండు మీటర్ల ఎత్తు అలలు ఎగసిపడుతున్నాయి.తుపాను కాస్త బలహీనపడి మచిలీపట్నం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో తుపానుగా కేంద్రీకృతమైంది. రానున్న ఆరు గంటల్లో...

మోంథా తుఫాన్ ప్ర‌భావంతో రైళ్లు, విమానాలు రద్దు

మోంథా తుఫాన్ విధ్వంసంతో రైల్వే శాఖ అప్రమత్తం అయింది. ప్రయాణికుల భద్రత కోసం వందకు పైగా రైలు సర్వీసులు రద్దు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే 43 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే 75కు పైగా రైళ్లు రద్దు చేశారు. అక్టోబర్ 27 28 29 30 తేదీల్లో రద్దు చేసిన రైళ్ల జాబితా...

Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...