Tuesday, January 27, 2026

News

ట్రాన్స్ జెండర్ల రిజర్వేషన్ల‌పై హైకోర్టు కీల‌క ఆదేశాలు

ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆరు నెలల్లో రిజర్వేషన్లు కల్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ట్రాన్స్ జెండర్ రేఖ హైకోర్టును ఆశ్రయించారు. 2025 మెగా డీఎస్సీలో రేఖ 671 ర్యాంకు...

పరకామణి కేసు సాక్షి మృతి.. హత్య కేసుగా నమోదు

అనంతపురం జిల్లాలో కలకలం రేపిన సతీష్ కుమార్ మరణం సంచలనం సృష్టించింది. పరకామణి కేసులో కీలక సాక్షి అయిన సతీష్ మృతి పట్ల గుత్తి రైల్వే పోలీసులు హత్యగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యాలాటి హరి ఫిర్యాదు మేరకు పరకామణి కేసు ప్రత్యర్థులు సతీష్‌ను హత్య చేశారని కేసు రిజిస్టర్ చేశారు. ఈ ఫిర్యాదు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు సంఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా మరో పెద్ద అలర్ట్ వెలువడింది. ఒకేసారి రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది అప్రమత్తమైంది. అబుదాబి నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చే ఇండిగో విమానం లండన్ నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చే బ్రిటిష్...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా కొనసాగుతోంది. 101 పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ ముందంజ వేసింది. తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందులోనూ కాంగ్రెస్ బలపడింది. మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. 62 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో నిలిచారు. మొదటి రౌండ్‌లో కాంగ్రెస్‌కు 8,926...

విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా నిర్వహిస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ భాగస్వామ్య సదస్సును అత్యంత ప్రాధాన్యతతో చేపట్టింది. రాష్ట్రానికి గరిష్ట పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన ఉద్దేశ్యంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. రెండు రోజులు సాగే ఈ సదస్సు కోసం విశాఖ సముద్ర తీరం అందంగా ముస్తాబైంది. నగర ప్రధాన మార్గాలను విద్యుత్ దీపాలతో...

ఢిల్లీ కారు బాంబు దాడిపై పాక్ మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు

భారత్‌లో ఉగ్రదాడుల మూలాలు పాకిస్తాన్‌లోనే ఉంటాయన్న నిజాన్ని పాక్ ఎప్పటికీ అంగీకరించదు. ఢిల్లీ కారు బాంబు పేలుడును కూడా తక్కువ చేసేందుకు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రయత్నించాడు. ఇది గ్యాస్ సిలిండర్ పేలుడు మాత్రమేనని, భారత్ రాజకీయ లబ్ధి కోసం దీన్ని ఉపయోగిస్తోందని ఆరోపించాడు. ఒక టీవీ కార్యక్రమంలో ఆసిఫ్ ఈ...

ఏనుగుల దాడిలో రైతు మృతి

కుప్పం మండలం కుర్మానిపల్లిలో ఏనుగుల దాడిలో రైతు కిట్టప్ప మృతి చెందాడు. రాగి పంటకు కాపలా కాస్తున్న సమయంలో ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనతో పరిసర గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల నుంచి రైతులను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బంగారుపాళెం మండలం టేకుమందలో సోమవారం రాత్రి ఏనుగులు పంట పొలాలపై...

ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు ఆందోళ‌న‌

ఢిల్లీ వాయు కాలుష్యం పెరుగుదలకు పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాలు తగలబెట్టడం ప్రధాన కారణమని సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం ఈ మేరకు...

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు న‌మోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కౌశిక్ రెడ్డి యూసుఫ్‌గూడ వద్ద ఫంక్షన్ హాల్‌లోకి అనుచరులతో వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో పోలీసుల హెచ్చరికలు లెక్కచేయకుండా ఉద్రిక్తత రెచ్చగొట్టినట్టు ఫిర్యాదు అందింది. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు.

బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో సిట్ ముందుకు ప్ర‌కాశ్ రాజ్

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసు మరింత ఉధృతమవుతోంది. సిట్ ముందు హీరో విజయ్ దేవరకొండ, యూట్యూబర్ సిరి హనుమంతు హాజరయ్యారు. విజయ్‌ను రెండు గంటలు, సిరిని నాలుగు గంటలు అధికారులు ప్రశ్నించారు. ప్రమోషన్ కోసం తీసుకున్న మొత్తాలు, డబ్బు రాకపోకలు, యాప్ సంస్థలతో ఒప్పందాలు గురించి వివరాలు అడిగారు. ఆర్థిక లావాదేవీల ఆధారాలు...

Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...