పెరుగుతున్న పన్ను ఎగవేతలు.. లిస్టులో తెలంగాణ, ఏపీ
ఇండియాలో జీఎస్టీ ఎగవేత కేసులు ఏటికేడు పెరుగుతున్నాయి. గత ఆరేళ్లలో తెలంగాణలో ఏకంగా రూ.9 వేల కోట్లు, ఏపీలో రూ.5 వేల కోట్ల ఎగవేత జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప అడిగిన క్వశ్చన్స్కు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి ఇచ్చిన జవాబుతో ఇది స్పష్టమైంది. విషయాన్ని వెల్లడించింది. జీఎస్టీ పరిహారం కింద ఆరేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.13,438 కోట్లు, తెలంగాణకు రూ.11,434 కోట్లు చెల్లించామని మంత్రి పంకజ్ తెలిపారు.