జస్ట్ రూ.99కే బ్యాంక్ను కొనేశారు! ఇదెక్కడి డీల్రా మావా!
పేదలు, మధ్యతరగతి ప్రజలకు ప్రస్తుత రోజుల్లో బతుకీడ్చడం కష్టంగా మారింది. ప్రతిదీ ప్రియమైపోయింది. పాలు, పెట్రోల్, కూరగాయలు, రెంట్లు.. ఇలా అన్నింటి ధరలు పెరిగిపోయాయి. రూ.100 నోటు తీస్తే గానీ ఏదీ కొనలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఓ అతిపెద్ద బ్యాంకును కేవలం రూ.99కే కొనేశారు. వంద రూపాయలకు బ్యాంకు కొనడం ఏంటని ఆశ్చర్యపోకండి. ఇది నిజమే. యూఎస్లో దివాలా తీసిన సిలికాన్ వ్యాలీ వ్యాలీ బ్యాంక్ యూకే సబ్సిడరీని కేవలం ఒక్క పౌండ్కు హెచ్ఎస్బీసీ సంస్థ దక్కించుకుంది. ఈ డీల్ ఎక్సలెంట్ స్ట్రాటజిక్ సెన్స్తో జరిగిందని హెచ్ఎస్బీసీ సీఈఓ నోయెల్ క్విన్ తెలిపారు.