రాజకీయ రంగంలో దేశంలోని అత్యంత శక్తిమంతులను ఇండియా టుడే ప్రకటించింది. ఇందులో తొలిస్థానంలో ప్రధాని మోడీ, రెండో స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిలిచారు. మూడో స్థానంలో అమిత్ షా, నాలుగో స్థానంలో రాహుల్ గాంధీ, ఐదో స్థానంలో చంద్రబాబు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో నితీశ్ కుమార్, యోగి ఆదిత్యనాథ్, స్టాలిన్,...
సిరిసిల్లలో మరో నేతన్న సూసైడ్ చేసుకున్నాడు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఎర్రం కొమురయ్య(55) ఎనిమిది నెలలుగా ఉపాధి లేక ఖాళీగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల బుధవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య కమల, ఇద్దరు కొడుకులు శ్రీకాంత్, సాయి కిరణ్, కూతురు వరలక్మి ఉన్నారు.
తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలకు సోషల్ మీడియా కోఆర్డినేటర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీరికి ప్రతి నెలా గౌరవ వేతనం కూడా ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది. ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ ఆధ్వర్యంలో తొలుత 408 ఆలయాలకు సోషల్ మీడియా కోఆర్డినేటర్లను నియమించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు స్థానిక ఎమ్మెల్యే లేదా ఇన్ చార్జి మంత్రి...
వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా లాక్కెల్లి కారులో ఎక్కించారు. అక్కడి నుంచి వికారాబాద్ లోని డీటీసీ సెంటర్ కు తరలించారు....
ఏపీలో జనవరి 5న జరగాల్సిన గ్రూప్–2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ పరీక్షలను పోస్ట్ పోన్ చేయాలని అభ్యర్థుల భారీగా వినతులు రావడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. తిరిగి ఫిబ్రవరి 23న పరీక్షలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది.
ఇండియన్ స్టాక్ మార్కెట్ మరోసారి కుప్పకూలింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ లో స్టాక్స్ అమ్మకాల ఒత్తిడి వల్ల మార్కెట్ పడిపోయింది. సెన్సెక్స్ 800 పాయింట్లకు దిగజారింది. నిఫ్టీ మళ్లీ 24వేల కంటే తక్కువకు పడిపోయింది. ఒక్క సెషన్ లోనే రూ.6లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉండడం, ట్రంప్ విజయం తర్వాత డాలర్ విలువ...
మినీ వరల్డ్ కప్ గా భావించే ఛాంపియన్స్ ట్రోఫీ సౌతాఫ్రికాలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ట్రోఫీ పాకిస్థాన్ లో జరగాల్సి ఉండగా.. పాక్ కు వెళ్లేందుకు భారత్ సుముఖంగా లేదు. హైబ్రిడ్ మోడల్ లో టోర్నీని నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు నిరాకరించడంతో సౌతాఫ్రికాలో ఈ టోర్నీ నిర్వహించేందుకు ఐసీసీ భావిస్తోంది....
అమెరికా ఎన్నికలకు ముందు భారీగా పెరిగిన బంగారం.. ఇప్పుడు తగ్గుతూ వస్తోంది. మంగళవారం రూ.1470 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల బంగారం రూ.70,850 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ.77,290 గా ఉంది. ఇది తగ్గుతుందా? మళ్లీ పెరుగుతుందా? అనేది చూడాలి. ఇప్పటికే పెండ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి గిరాకీ పెరిగింది.
రష్యా, ఉత్తర కొరియా మధ్య కీలక ఒప్పందం జరిగింది. శత్రు దేశాలు యుద్ధానికి వస్తే ఒకరికి ఒకరు సహకరించుకునేలా ఒప్పందం చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన ఎంవోయూను ఇరు దేశాలు ఆమోదించాయి. ఈ ఏడాది జూన్ లోనే ఈ డీల్ జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే రష్యా కోసం ఉత్తర కొరియా...
వివాదంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం
మహారాష్ట్ర పత్రికల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం వివాదాస్పదమైంది. మహారాష్ట్రలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇక్కడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలపై యాడ్స్ ఇచ్చింది. మహారాష్ట్రలోని అన్ని ప్రముఖ పత్రికల్లో అచ్చు వేయించింది. ఇందుకోసం రూ.300 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. సదరు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా...
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావడంతో ఆస్పత్రి పాలయ్యారు. కొద్ది రోజుల...