మహారాష్ట్రలో మహాయుతి కూటమి(బీజేపీ, శివసేన(షిండే వర్గం), ఎన్సీపీ(అజిత్ పవార్) విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 288 సీట్లకు గాను మహాయుతి కూటమి 233 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ మహా వికాస్ అఘాడీ కూటమి(కాంగ్రెస్, శివసేన(థాక్రే), ఎన్సీపీ(శరత్ పవార్) కేవలం 51 సీట్లకే పరిమితం అయింది. దీంతో మహాయుతి కూటమి నుంచి...
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా మేజిక్ ఫిగర్ 145 సీట్లు రావాల్సి ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రంలో మహాయుతి(బీజేపీ, శివసేన(ఏక్ నాథ్ షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్)) 82 సీట్లతో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మహావికాస్ అఘాడీ(కాంగ్రెస్, ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ(శరద్ పవార్)) 30 సీట్లతో...
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ఒక పార్టీపై గెలిచి మరోపార్టీలో చేరారని పిటిషన్ వేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును వాయిదా వేసింది. నేడు దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేల...
ప్రభాస్ ఎవరో తనకు ఇప్పటికీ తెలియదని, కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ కు అదానీ లంచం ఇచ్చినట్లు అమెరికా దర్యాప్తులో వెల్లడైందని, జగన్ ఏపీ పరువు తీశారని పేర్కొన్నారు. విద్యుత్ ఒప్పందాల పేరిట...
దేశంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా పేరొందిన గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం కలకలం రేపింది. రాజకీయంగా పెను దుమారం రేగడంతో పాటు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అదానీతో పాటు మరో ఎనిమిది మందిపై అమెరికాలోని న్యూయార్క్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అసలు కేసు ఎందుకు నమోదు అయింది? దేశ...
కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) సీనియర్ ఐఏఎస్ అధికారి కె. సంజయ్ మూర్తి నియామకం అయ్యారు. గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. హిమాచల్ ప్రదేశ్ కేడర్ కు చెందిన ఆయన 1989లో ఐఏఎస్ అయ్యారు. అక్కడే 13 ఏండ్ల పాటు పనిచేశారు. ఆ తర్వాత...
– మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం
బొంకుల చంద్రబాబు మళ్లీ అవే మోసాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో రూ.14 లక్షల కోట్ల అప్పులు అని ప్రచారం చేసి.. ఇప్పుడు రూ.6లక్షల కోట్లు మాత్రమే చూపించారని పేర్కొన్నారు. అవి కూడా చంద్రబాబు హయాంలో...
యూట్యూబ్ ఛానల్స్, ఇన్ఫ్లుయెన్సర్లు ఇచ్చే నెగటివ్ రివ్యూలపై తమిళ ఇండస్ట్రీ కొరడా ఝుళిపించింది. సినిమా విడుదలైన తర్వాత థియేటర్ ఓనర్లు యూట్యూబ్ ఛానళ్లను థియేటర్ ప్రాంగణంలోకి అనుమతించవద్దని నిర్ణయం తీసుకుంది. రివ్యూల పేరుతో నటులు, దర్శకులు, నిర్మాతల వ్యక్తిగత జీవితాలపైనా విమర్శలు చేస్తున్నారని ఘాటుగా స్పందించింది. ఈమేరకు తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్...
మహారాష్ట్ర, జార్ఘండ్ రాష్ట్రాలలో పోలింగ్ మొదలైంది. మహారాష్ట్రలో ఒకే విడతలో 288 సెగ్మెంట్లకు ఓటింగ్ జరుగుతోంది. జార్ఘండ్ లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. రెండు రాష్ట్రాలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోటెత్తారు. రాజకీయ నాయకులు, క్రికెటర్లు, ప్రముఖులు ఓట్లు వేస్తున్నారు.
తెలంగాణ సెక్రటేరియట్ భవనంలో వాస్తు పేరిట మార్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బాహుబలి గేటును అధికారులు కూల్చివేస్తున్నారు. ఇందుకోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.3 కోట్లు వెచ్చిస్తోంది. వాస్తు పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేయడం సరికాదని పలువురు చెబుతుండగా... సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు. బాహుబలి గేటు మూసివేసి మరో గేటును ఏర్పాటు చేస్తున్నారు.
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావడంతో ఆస్పత్రి పాలయ్యారు. కొద్ది రోజుల...