తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో రెండో రోజు పర్యటన కొనసాగించారు. ఉదయం 6 గంటలకే కుటుంబ సమేతంగా సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆయనతో పాటు సతీమణి, కూతురు, అల్లుడు, మనవరాళ్లు కూడా పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.251 కోట్ల వ్యయంతో మేడారంలో అభివృద్ధి చేసిన గుడి ప్రాంగణాన్ని సీఎం ప్రారంభించి...
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తాను జీవితంలో ఇకపై సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని ప్రకటించారు. సంగారెడ్డి ప్రజలు, ముఖ్యంగా ఇక్కడి మేధావులు తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ నియోజకవర్గంతో రాజకీయంగా ఇక సంబంధం పెట్టుకోనని తేల్చిచెప్పారు. శనివారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన కోసం ఏఐసీసీ...
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం బీహార్‌లోని కేసరియాలో కొలువుదీరింది. విరాట్ రామాయణ మందిర్‌లో 33 అడుగుల ఎత్తు, 210 టన్నుల బరువు ఉన్న మహా శివలింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు. ఈ శివలింగం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా గ్రానైట్ శివలింగంగా గుర్తింపు పొందింది. ఈ భారీ శివలింగాన్ని తమిళనాడులో దాదాపు పదేళ్ల పాటు ప్రత్యేకంగా తయారు...
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించిన నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్ వర్గం) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అవకతవకలు జరగడం వల్లనే బీజేపీ గెలిచిందని ఆయన ఆరోపించారు. ఇది ప్రజాభిమానంతో వచ్చిన విజయం కాదని, పూర్తిగా కుట్రపూరితంగా, అక్రమంగా సాధించిన గెలుపని అన్నారు....
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో దేశాలపై విధిస్తున్న సుంకాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు, రిపబ్లికన్ పార్టీకి చెందిన రిచ్ మెక్‌కార్మిక్ ట్రంప్ పాలసీలపై చర్చలో భారతదేశంతో తప్పుగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. “భారత్ అమెరికాకు పెట్టుబడులు తీసుకు వస్తుంది....
ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా పోరాడాలని ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘మొంథా’ తుఫాను తీవ్ర నష్టం కలిగించినా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరైన...
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దిత్వా’ తుఫాను తీవ్ర వాయుగుండంగా మారి మరోసారి బలహీనపడింది. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా కదులుతోంది. కరైకాల్‌కు 120 కి.మీ., పుదుచ్చేరికి 90 కి.మీ., చెన్నైకి 150 కి.మీ. దూరంలో ఉంది. తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. భారీ నుంచి...
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ ప్రత్యేక పర్యటనలో మెస్సీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకునే అవకాశం ఉంది. తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రముఖం చేయడానికి మెస్సీని రాష్ట్ర గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్‌గా ఆహ్వానించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో సీఎం...
హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్ అయింది. ఈసారి డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కోయంబత్తూరు ఈషా యోగా సెంటర్‌లో రహస్య పెళ్లి జరగబోతోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చిన విషయం రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామల క్రిప్టిక్ పోస్ట్...
దక్షిణ గోవాలోని ప్రఖ్యాత ‘శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలీ జీవోత్తమ్ మఠం’లో 77 అడుగుల ఎత్తైన కాంస్య శ్రీరామ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరామ విగ్రహంగా ఇది గుర్తింపు పొందనుంది. మఠం 550వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ముఖ్యమంత్రి...