మామిడి పండ్లు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మామిడి పండ్లు తినడం వల్ల బరువు పెరగతారు. షుగర్ ఉన్న వాళ్లు మామిడి పండ్లు తింటే షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. మామిడి పండు తిన్న వారు ఆహారం తినడం తగ్గించుకోవాలి. మామిడి పండ్లు తినడం వల్ల మల విసర్జన సులువుగా జరుగుతుంది. మామిడి పండ్లతో మలబద్దకం పోతుంది. మామిడి పండ్లలో రసంతో పాటు తొక్కను కూడా తినడం చాలా మంచిది. మామిడి పండ్లకు ఉప్పు, కారం అద్ది తినడం అస్సలు మంచిది కాదు. కార్బెడ్ తో పండించిన మామిడి పండ్లు తినడం వల్ల కూడా చాలా రకాల రోగాలు వస్తాయి. క్యాన్సర్, నరాల బలహీనత, ఆకలి కాకపోవడం వంటివి వస్తాయి. సహజసిద్ధంగా పండిన మామిడి పండ్లు తినడం చాలా మంచిది.