కాంతారా హీరో రిషబ్ శెట్టి, రష్మిక మద్య కోల్డ్ వార్ఇ.. టీవల విడుదలైన కాంతారా సినిమా భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే రష్మిక మందన హిరోయిన్ గా చేసిన మొదటి సినిమా కిరాక్ పార్టీ. ఈ సినిమాకు కథ అందించినది రిషబ్ శెట్టి. ఇదిలా ఉండగా రష్మిక మందనను సోషల్ మీడియాలో కాంతారా సినిమా చూశారా అని అడగగా తాను చూడలేదని సమాధానం ఇచ్చారు. అలాగే తనకు లైఫ్ తన ఫోటోను చూసి వచ్చిందని చెప్పారు. దీనిపై రిషబ్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఇప్పుడున్న హీరోయిన్ లలో రష్మిక, సమంత, సాయిపల్లవిలలో ఎవరితో సినిమా చేస్తారని అడగగా సమంత, సాయిపల్లవి అంటే తనకు ఇష్టమని, కొత్త హీరోయిన్ లతో కూడా చేయాలని ఉందని చెప్పారు. కొంత మంది హీరోయిన్ లతో అసలు పనిచేయాలని లేదని పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో వీరిద్దరి కామెంట్స్ వైరల్ గా మారాయి.