చలికాలంలో చర్మ సమస్యలా అయితే ఇది చదవండి.. చలికాలంలో చర్మం ఎక్కువగా పొడిబారిపోతుంది. ఈ కాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుండటం సర్వసాధారణం. ముఖం, కాళ్లు, చేతులు పగుళ్లు ఏర్పడటం జరుగుతుంది. పెదాలు పగిలి పోవడం కూడా చలికాలంలో సంభవిస్తుంది. వాతావరణంలోని మార్పులు ఇందుకు కారణం అవుతాయి. దీంతో చెమట శరీరంలో పేరుకుపోయి ఇన్ ఫెక్షన్ లు వచ్చే అవకాశం ఎక్కువగగా ఉంది. ఇంట్లోని వస్తువులతోనే వీటికి చెక్ పెట్టవచ్చు.
పసుపుతో ఎంతో మేలు
ఇన్ ఫెక్షన్ లు వచ్చిన చోట పసుపును నీటితో కలిపి రుద్దాలి. కాసేపు ఆరనిచ్చి, ఆ తర్వాత కడిగేయాలి. ఇలా రెండు నుంచి మూడు సార్లు చేస్తే పసుపులోని యాంటిబాడీలు ఇన్ ఫెక్షన్ సమస్యను తగ్గిస్తాయి. దురద ఉన్న చోట కూడా పసుపు అప్లై చేసి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
వెల్లుల్లి ఉపయోగాలు
చలికాలంలో వెల్లుల్లి మీకు ఎంతో మేలు చేస్తుంది. మూడు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని పేస్ట్ చేసుకోవాలి. ఇన్ ఫెక్షన్ లు ఉన్న చోట దాన్ని అప్లై చేసుకుంటే అవి తగ్గిపోతాయి.
పెరుగు, టమోటోతో మంచి ఫలితాలు
చలికాలంలో చర్మానికి పెరుగు, టమోటో కలిపిన మిశ్రమాన్ని కలిపి రుద్దితే మంచి ఫలితాలు ఉంటాయి. చర్మానికి అరగంట పాటు రుద్ది ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. అలా చేస్తే చర్మం పొడిబారడం తగ్గిపోవడంతో పాటు కాంతివంతంగా కనిపిస్తుంది.
చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చలికాలంలో ఎక్కువగా దాహం లేకపోవడం, వేడిగా ఉండే చిరుతిండి తినడం చేస్తుంటాం. చలికాలంలో మూత్రం ఎక్కువగా వస్తుంది. మూత్రం ఎక్కువగా వస్తుందని నీరు తాగడం మానేస్తే డీ హైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. నీటిని కనీసం రోజుకు 3లీటర్లు అయినా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నూనె పదార్థాలు తీసుకోవడం వీలైనంత తగ్గించడం మంచిది.