Sunday, November 29, 2026

ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికలు

Must Read

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 27 జిల్లాల్లో ఉన్న 246 మండలాల పరిధిలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 3880 గ్రామ పంచాయతీల పరిధిలో 1170 సర్పంచ్ స్థానాలు మరియు 19655 వార్డు సభ్యుల స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3803 సర్పంచ్ స్థానాలు మరియు 29603 వార్డు స్థానాలకు పోలింగ్ కొనసాగుతుండగా 83 లక్షల 52 వేల 338 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 37019 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు వెబ్ కాస్టింగ్ మరియు వీడియోగ్రఫీ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుండగా అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

850 మంది ఎంపీలతో లోక్ సభ సాధ్యమేనా – శశి థరూర్

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. జార్ఖండ్ లోని జంషెడ్ పూర్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -