Monday, November 2, 2026

ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

Must Read

అర్నబ్ తుఫాన్ ప్రభావం నుంచి తీర ప్రాంతాలు పూర్తిగా తేరుకోకముందే బంగాళాఖాతంలో మురసు పేరుతో మరో తుఫాన్ ఆందోళన కలిగిస్తోంది. ఈ తుఫాన్ వేగంగా బలపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. గంటకు సుమారు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్ ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండగా, తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే వర్షాలు కొనసాగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలోనూ తుఫాన్ ప్రభావం కారణంగా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ములుగు, భద్రాద్రి, వరంగల్, మహబూబాబాద్, జనగామ, సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోనూ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. మరోవైపు వరుస తుఫాన్లతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బతినడం, ధాన్యం తడిసిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని భయపడుతున్నారు. ఇప్పటికే వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు మరో తుఫాన్ రూపంలో ముప్పు పొంచి ఉండటంతో వ్యవసాయ రంగంపై ఆందోళన పెరుగుతోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

ఢిల్లీలో నేటి నుంచి ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్

దేశంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని విస్తరించడంతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో 2026...
- Advertisement -

More Articles Like This

- Advertisement -