వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ప్రజా జీవితంలో 25 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం దేశ ప్రధానిగా కొనసాగడం విశేషమని జగన్ పేర్కొన్నారు.
ప్రజాసేవలో మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం చారిత్రాత్మక సందర్భమని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రధానికి భవిష్యత్తులో మరింత మంచి జరగాలని ఆకాంక్షించారు. ప్రజా జీవితంలో ఆయన సేవా ప్రస్థానం మరింత విజయవంతంగా కొనసాగాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా తన శుభాకాంక్షలను వెల్లడించారు.

