బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు వైఎస్సార్‌సీపీని వీడుతున్నారని ఆరోపించారు. గతంలో వైఎస్సార్‌సీపీలో ఉన్న నేతలను విమర్శించిన టీడీపీ నాయకులే ఇప్పుడు వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అన్ని గ్రామాల్లో పోటీ చేయాలని, పుకార్లను పట్టించుకోకుండా కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. గ్రామస్థాయిలో ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేసి అన్ని స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రెండేళ్లలో వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లడంతో పాటు సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఎత్తిపోతల పథకాలపై దృష్టి పెడతామని అన్నారు. వైఎస్సార్‌సీపీ గుర్తింపు కార్డు ఉన్న ప్రతి కార్యకర్తను వైఎస్ జగన్ సైన్యంగా అభివర్ణించిన ఆయన, భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే కార్యకర్తలకు కీలక పాత్ర ఉంటుందని పేర్కొన్నారు.

