Tuesday, April 28, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసులు

Must Read

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని సిట్ స్పష్టంగా పేర్కొంది.ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురిని ప్రశ్నించిన సిట్, రాజకీయ నేతల వైపు దృష్టి పెట్టింది. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి హరీష్‌రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు ఏడు గంటల పాటు సాగిన ఈ విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.విచారణ అనంతరం హరీష్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకుని మీడియాతో మాట్లాడారు. తమకు ఉద్యమాలు కొత్త కాదని, ఇలాంటి పరిస్థితులను గతంలోనూ ఎదుర్కొన్నామని చెప్పారు. అక్రమ కేసులు పెట్టడం కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. నోటీసులు ఇచ్చినందుకు భయపడేది లేదని, చట్టాన్ని గౌరవిస్తూ విచారణకు సహకరిస్తామని తెలిపారు.అలాగే ఉదయం ఒక విషయం బయటపడితే, సాయంత్రానికి తనకు నోటీసులు వచ్చాయని హరీష్‌రావు వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఇప్పుడు అదే కేసులో కేటీఆర్‌కు కూడా నోటీసులు ఇవ్వడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరెవరిని చేరుకుంటుందో, దర్యాప్తు ఎటు దారితీస్తుందోనన్న ఉత్కంఠ రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. రేపు కేటీఆర్ విచారణకు హాజరయ్యే నేపథ్యంలో ఈ కేసు మరో కీలక దశకు చేరినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -