Thursday, November 27, 2025

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై జ‌న‌సేన క‌స‌ర‌త్తు

Must Read

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పార్టీని సంస్థాగతంగా బలపరచేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీ నిర్మాణ బాధ్యతలను రామ్ తాళ్లూరికి అప్పగించారు. స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకొని రెండు రాష్ట్రాల్లోనూ విభాగాలవారీగా సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో నాయకత్వంలో పూర్తి మార్పు, గ్రామీణం నుంచి పట్టణం వరకు కొత్త ఆర్గనైజేషనల్ నిర్మాణం తీసుకొస్తున్నారు. ఇకపై స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వరకు ప్రత్యక్షంగా పోటీ చేసేలా వ్యూహం సిద్ధం చేశారు. ఏపీలో సాధించిన 100 శాతం స్ట్రైక్ రేట్‌ను తెలంగాణలోనూ పునరావృతం చేయాలన్నది పవన్ లక్ష్యం. బూత్ స్థాయి నుంచి కేడర్‌ను సన్నద్ధం చేస్తూ మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచే అన్ని కార్యక్రమాలు సమన్వయం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజ్యాంగ దినోత్సవం సంద‌ర్భంగా అంబేద్కర్‌కు జగన్ నివాళి

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -