Monday, June 1, 2026

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు

Must Read

హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్ బిజినెస్‌లపై ఆదాయపు పన్ను శాఖ మరోసారి దాడులు చేసింది. పాతబస్తీలోని పిస్తా హౌస్, షా గౌస్ హోటల్స్ ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో 15 చోట్ల సోదాలు జరిగాయి. పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ మస్తాన్ నివాసాల్లోనూ దాడులు కొనసాగాయి. ఏటా వందల కోట్ల టర్నోవర్ ఉన్న ఈ హోటల్స్ రికార్డుల్లో చూపిన ఆదాయం, నిజమైన ఆదాయం మధ్య భారీ తేడా ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. హవాలా లావాదేవీలు, నకిలీ బిల్లులు, అనుమానస్పద ట్రాన్సాక్షన్లు ఆరోపణలు వెలుగుచూశాయి. మస్తాన్ ఇంట్లోనే నాలుగు బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -