తెలంగాణ హోమ్ శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ ఎమోజి రిప్లైపై బాలకృష్ణ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీ సమావేశం పోస్టుకు వచ్చిన కామెంట్‌కు నవ్వు ఎమోజి పెట్టడం వివాదాస్పదమైంది. దీనిపై సీవీ ఆనంద్ స్పందిస్తూ, రెండు నెలల క్రితం హ్యాండ్లర్ పొరపాటున పెట్టిన ఎమోజి అని, తనకు తెలియకుండా జరిగిందని వివరించారు. పోస్ట్ తొలగించి బాలయ్యకు మెసేజ్ చేశానని, బాధ కలిగితే క్షమాపణలు అడుగుతున్నానని తెలిపారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున సినిమాలు చూస్తూ పెరిగానని, అందరితో గౌరవం ఉందని అన్నారు. హ్యాండ్లర్‌ను తొలగించానని, వివాదాన్ని ముగించాలని కోరారు.

