Thursday, April 16, 2026

పైరసీ సైట్ల మూసివేత

Must Read

పైరసీ చిత్రాలకు కేంద్రంగా మారిన ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు మూసివేశారు. శనివారం అరెస్టైన నిర్వాహకుడు ఇమ్మడి రవి సమాచారంతోనే లాగిన్‌లు, సర్వర్‌లను బ్లాక్ చేశారు. గతంలో ఇమ్మడి రవి ‘కోట్ల మంది డేటా ఉంది, ఫోకస్ ఆపండి’ అంటూ సవాల్ విసిరిన లేఖ సోషల్్ మీడియాలో వైరల్ అయింది. ఆ సవాల్‌ను స్వీకరించి పోలీసులు సైట్లను షట్‌డౌన్ చేశారు. ఇమ్మడి రవి వద్ద స్వాధీనం చేసుకున్న వందల హార్డ్ డిస్క్‌లను విశ్లేషిస్తున్నారు. బ్యాంక్ ఖాతాల వివరాలు పరిశీలిస్తున్నారు. మరిన్ని విషయాల కోసం కస్టడీకి తీసుకునేందుకు సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -