Wednesday, October 14, 2026

వేములవాడ ఆలయంలో భక్తుల దర్శనాలు తాత్కాలిక నిలిపివేత

Must Read

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం తెల్లవారుజామునుంచి భక్తుల దర్శనాలు నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం ప్రధాన గేటు వద్ద ఇనుప రేకులు ఏర్పాటు చేశారు. ఆలయ చుట్టూ పలు చోట్ల ఇప్పటికే రేకులు అమర్చారు. భక్తుల కోసం స్వామివారి ప్రచార రథం వద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఉంచారు. భీమేశ్వరాలయంలో దర్శనాలు, కోడె మొక్కులు, ఆర్జిత సేవలు కొనసాగుతున్నాయి. నెల రోజులుగా ఆలయ పరిసరాల్లో కూల్చివేతలు జరుగుతున్నాయి. దక్షిణ, ఉత్తర ప్రాకారాలు, పడమర నైవేద్యశాల, ఈవో కార్యాలయం తొలగించారు. ముందస్తు సమాచారం లేకుండా ఆలయాన్ని మూసివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -