భక్త కనకదాస జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. కుల మత భేదాలను తుడిచేసిన భక్తి యోధుడు శ్రీకృష్ణ భక్తుడు భక్త కనకదాస అని పేర్కొన్నారు. సాహిత్యంతో సామాజిక విప్లవం సాధ్యమని నిరూపించిన మహానుభావుడు అని చెప్పారు. భక్తి కీర్తనలతో కవిత్వానికి కొత్త ఊపిరి పోశారని తెలిపారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య దైవం అని ట్వీట్ చేశారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో భక్త కనకదాస జయంతి ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కుము-కురబ నేత గడ్డం రామకృష్ణ పాల్గొన్నారు.

