Thursday, October 30, 2025

విజయ్ ఆర్థిక‌ సాయాన్ని తిరస్కరించిన కుటుంబం!

Must Read

తమిళనాడు కరూర్‌లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో మృతుడైన రమేశ్ భార్య సంఘవి, టీవీకే అధ్యక్షుడు విజయ్ పంపిన 20 లక్షల రూపాయల పరిహారాన్ని తిరిగి పంపేసింది. మృతుల కుటుంబాల ఖాతాల్లో ఈ నెల 18న జమ చేసిన మొత్తాన్ని తిప్పి పంపినట్లు సంఘవి తెలిపింది. విజయ్ వీడియో కాల్‌లో మాట్లాడుతూ, తను నేరుగా వచ్చి ఓదార్చుకుంటానని, ముందు ఆర్థిక సహాయం తీసుకోవాలని సూచించినట్లు ఆమె చెప్పింది. అయితే, డబ్బు ముఖ్యం కాదని, విజయ్ పరామర్శ కోసం ఎదురుచూస్తున్నామని, తమ ఇష్టానికి విరుద్ధంగా జమ చేసిన మొత్తాన్ని తిరిగి పంపామని బాధితులు వివరించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి: వైయ‌స్ జగన్

మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూచించారు. తుపాను ముప్పు తగ్గే వరకు అందరూ సురక్షిత...
- Advertisement -

More Articles Like This

- Advertisement -