Tuesday, April 28, 2026

నకిలీ ఓఆర్ఎస్‌పై ఎనిమిదేళ్ల పోరాటం: హైదరాబాద్ వైద్యురాలి విజయం!

Must Read

హైదరాబాద్‌కు చెందిన పిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని 8 ఏళ్ల పోరాటంతో నకిలీ ఓఆర్ఎస్ బ్రాండ్‌లపై విజయం సాధించారు. ఓఆర్ఎస్ పేరుతో వస్తున్న కొన్ని బ్రాండ్‌లు డబ్ల్యూహెచ్ఓ నిబంధనలు పాటించకుండా, అధిక గ్లూకోజ్, తక్కువ ఎలక్ట్రోలైట్‌లతో ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని ఆమె ఆరోపించారు. “వంద మిల్లీలీటర్ల ఓఆర్ఎస్‌లో 1.35 గ్రాముల గ్లూకోజ్ ఉండాలి, కానీ నకిలీ బ్రాండ్‌లలో 8-12 గ్రాముల వరకు ఉంటోంది,” అని ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాస్తూ పోరాడారు. ఈ లేబుల్స్ రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఆమె, చివరకు ప్రభుత్వాన్ని ఒప్పించి కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేశారు. “నకిలీ ఓఆర్ఎస్ లేబుల్స్ వల్ల ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -