ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ సేవకు అంకితమైన కర్మయోగి అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు. మోదీ రెండు తరాలను నడిపిస్తూ ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించారని, దేశ జెండాను ప్రపంచ వేదికపై గర్వంగా నిలబెట్టారని పవన్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 15 ఏళ్లకు పైగా బలంగా నిలిచి, రాబోయే తరాల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో అందరం సమష్టిగా పనిచేస్తామని తెలిపారు.