Tuesday, October 21, 2025

ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు!

Must Read

ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రాంతంలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించి, స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. రాత్రి 2 గంటల సమయంలో సుమారు 2 సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. ముఖ్యంగా, సీఎస్ఆర్ శర్మ కాలేజీ ప్రాంతంలో ఈ ప్రకంపనలు స్పష్టంగా కనిపించినట్లు వెల్లడించారు. అయితే, రాత్రి సమయం కావడంతో ఈ స్వల్ప ప్రకంపనలు గుర్తించేలోపే తీవ్రత తగ్గినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. గతంలో కూడా ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మే నెలలో మరియు గత ఏడాది డిసెంబర్‌లో ఇలాంటి ఘటనలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. తాజా భూ ప్రకంపనలపై మరింత సమాచారం సేకరణ జరుగుతోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -